banner

చేతనాచేతన రూపము నుండి ఈ ప్రపంచమంతయు శివమయమై యున్నది. అట్టి శివుడు పంచభుతాలకూ అదిపథియై సర్వాప్రాణ కోటికి ఆధారభూతమై శైవ క్షేత్రములో మహా పుణ్యక్షేత్రామగు సాక్షాత్ అపర శ్రీశైలం లాంటి .ఒదెల క్షేత్రము,శివభక్తి పారవశ్యాతను ప్రసాధిస్తూ సకల లోక మానవాళి సంరక్షణకై ధయాభిక్షుడగు శ్రీ మల్లికార్జున స్వామి జగజ్జనని శ్రీ బ్రామరాంబ సమేతంగా వెలసి అసంక్యఖమైన భక్త జనుల సేవలందుకొనుచు వారి వారి మణోభీష్టములను నెరవేర్చుకొనుచున్నారు.

పూర్వకాలము ఈ ప్రాంతము ధండకారణ్యాముగా యున్నరోజులలో పంకజ మహామునీశ్వరుడను మహాముని ఇక్కడ శివ లింగాన్ని సేవిస్తూ తపస్సు గావించెనని మరియు అర్ధరాత్రి సమయంలో మునీశ్వరులు వచ్చి స్వామి వారిని,సేవింతురని ప్రతీతి ధీనికి తార్కాణముగా ఆలయ స్థంబముపై చెక్కబడిన మునీశ్వరుని రూపము మరియు నామధేయము బట్టి మనకు తెలియుచున్నది.కాలక్రమెనా కలియుగము వచ్చేసరికి ఇట్టీ శివలింగము పై పుట్ట పెరిగి గుప్తమైనధని తెలియుచున్నది.

ఇట్టీ స్థలముయందు చింతకుంటూ ఓధెలు అను రైతు సేధ్యముచేయుచు అక్కడ ఉన్నటువంటి పుట్టను ధూన్నుచుండగా పుట్టలోయున్నటువంటి శివలింగమునకు యానాగతీకర్ృుటగులగా ఆకాశమంతయు ధిక్కులు పిక్కతిళ్లునట్లు ఓంకార శబ్ధమురాగ కాంతి రేకలు విరజిమ్మగా ఇట్టీ పరిణామమునకు ఓధెలు నిశ్చేష్టుడై నిలుచుండిపోగా ఆకాశవాణి ఓయీ ఓధెలు! నీ వల్ల నాకు గాయము ఏర్పడేను కావున నీ వంశము నశించుగాకయని పలుక ఓధెలు! తేరుకొని స్వామి నా తప్పీధము ఏమీ లేదు నన్ను క్షమించి మోక్షన్ని ప్రసాధించు స్వామి యని వేడుకోనగా స్వామివారు ప్రసన్నామై ఓధెలుకు శాశ్విత మోక్షాన్ని ప్రసాధించెను.

ఓయీ ఓధెలు! నేను ఒధెల శ్రీ మల్లికార్జున స్వామిగా ఇక్కడే స్థిరంగా ఉండి నా భక్తుల కోర్కెలు తీర్చుతాను నన్ను శరణన్న వారి కస్టాలు నెరవేర్చుతాను మరియు ఈ గ్రామము కూడా ఓధెలుగా ప్రసిద్ధి గాంచునుయని పలికెను. ఇట్టి పరిణామము నుండిమేల్కోని చూడగా పుట్టలో గాయమై ఉన్నటువంటి శివలింగము మహాతేజముగా కనిపించెను.కావున శ్రీ మల్లికార్జుణస్వామి స్వయంభుగా చెప్పబడుచున్నది.
ఈ ఆలయము కాకతీయుల కాలములో పునర్నిర్మాణ మైనదని తెలియుచున్నది. ఇట్టి నిర్మాణ సమయమందు దక్షిణ దిశగా శ్రీ బ్రామరాంబ అమ్మవారిని, ఉత్తర దిశగా శ్రీ వీరభధ్రస్వామిని, క్షేత్రపలకునిగా శ్రీ భైరవ స్వామిని క్షేత్రపలకునిగా శ్రీ భైరవ స్వామిని ప్రతిష్టించిరి.వీర శైవ ఆగమ శాస్త్ర ప్రకారముగా శ్రీశైల పండితారాధ్య పీిఠముకు చెంధిన వృషభ గోత్రోధ్భవులైన మహేశ్వరులచే స్వామి నిత్యపూజదులు జరుపబడుచుండేను. మరియు ఆలయమునకు పస్చిమదిసయమ్దు.వీరశైవ మఠం కుడియుండేననీ ధీనికి తార్కాణముగా ఆలయమునకు పశ్చిమదిశగా మఠ మర్రియును పేరుగల పెద్ద వృక్షము కూడా గలదు.

ఇచ్చట ఆధిరెడ్డి నీలమాదేవి యను ధంపతులు కొండవీటి వంశమునకు చెందినవారు. పుత్ర సంతానములేక ప్రజల కస్టాలు చూడలేక దుష్టులు అదికమగుటచే శ్రీ స్వామి వారి భక్తురాలైన నీలమాదేవి స్వామివారిని సేవించి నీ అంశతో కూడినట్వంటి పుత్రిని వారముగా ఇచ్చి దుష్టసంహారముగావించి ప్రజలందరిని కాపాడమని కోరగా శ్రీ స్వామివారు అనుగ్రహించి శ్రీ ఖండిశ్వర స్వామిగా అవతరించి ధుష్ట సంహారము గావించి ప్రజలందరిని కాపడుచుండేను. అట్టి సమయమున బలిజ వంశమునకు చెందిన మెడలాదేవి,యాదవ కులమునకు చెందిన కేతమ్మ ఆను కన్యలు శ్రీ స్వామివారిని సేవించి అతనిలో లీనమైరి. అందుకు ప్రతీకగా శ్రీ స్వామివారి ఆలయమునకు ఈశాన్యదిశలొ శ్రీ ఖండేశ్వర స్వామి,మెడలాదేవి కేతమ్మల విగ్రహములను ప్రతిష్టించిరి.ఆ నాటి వరకు యాదవుల ఆరాధ్య దైవముగా వెలుగొందుచుండెను.

ఈ ఆలయ నిర్మాణ క్రమము బట్టి కాకతీయ కాలములో పునర్నిర్మానమైనదని తెలియుచున్నది. మరియు రెడ్డి వంశీయులుకూడా
కాకతీయవంశము వారని తెలీయు చున్నది .వీరు దాదాపు 1330 సం|| చెందినవారని అవగతమగుచున్నది. మరియు శ్రీ రామ చంద్రుడు వాన వాసము చేయుచు రామగిరి కీలా నుండి ఇల్లంత కుంటకు పోవు మార్గమున ఇచ్చట శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొనేనని అందుకు ప్రతీకగా శ్రీ స్వామివారికి సమాంతరంగా శ్రీ సీతారామచంద్ర స్వామిని ప్రతిష్టించిరని ఇప్పటికీ ప్రజలు చెప్పుకొనేదురు మరియు ఆలయమునకు థూర్పు దిశగా బంగారు పోచమ్మ వాయువ్య దిశగా మధన పోచమ్మ వార్ల దేవాలయములు కలవు.ఈ ఆలయం గత 50 సంవత్సరముల నుండి దేవాదాయ దర్మాదాయ శాఖవారి ఆద్వర్యములోవిరాజుల్లుచున్దెను.ఈ ఆలయము దిన దిన ప్రవార్ధమానంగా వెలుగోంధుతూ ప్రతి నిత్యం అభిషేకములు పట్నములు ,బోనము ,కోడె మ్రొక్కుబడులతో భక్తులు వారి వారి అభీస్టాములను నెరవేర్చుకొనుచున్నారు. మరియు ప్రతి ఆది,భూధవారములలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించి వారి వారి మ్రొక్కుబడులు సమర్పిన్చెదరు.ఇట్టి మహిమావితమైన శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని దర్శించి తరించి పూనిితులు కాగలరు.

శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానము,ఒదెల గ్రామము మరియు మండలము,కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా కేంద్రమునకు ఈశాన్య దిశలో 40కిలోమీటర్ల దూరంలోనూ వరంగల్ పట్టణమునకు ఉత్తరమున 60కిలోమీటర్ల దూరంలోను కాజీపేట,బల్లార్ష రైలు మార్గములో కజీపేట నుండి ఉత్తరమున55 కిలోమీటర్ల దూరంలో ఒదెల రైల్వే స్టేషన్ సమీపంలో వెలసిన అతి పురాతన దివ్యసైవక్శెత్రము.ఈ దేవాలయము కరీంనగర్ జిల్లాలో గల ముఖ్య ప్రాచీన దేవాలమ్యములలో ఒకటి.

“లోకాను సమస్త సుఖినోభవంతు”